హైదరాబాద్, ఆట ప్రతినిధి: గోల్ఫ్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు గచ్చిబౌలీ బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ క్లబ్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక గోల్ఫ్ అండ్ టర్ఫ్ సమ్మిట్ అండ్ ఎక్స్పో 2025 శుక్రవారం విజయవంతంగా ముగిసింది.
దేశవ్యాప్తంగా గోల్ఫ్‌ను ప్రమోట్ చేయడం, గోల్ఫ్ కోర్సుల నిర్మాణంలో సాంకేతికను జోడించడం, యువ గోల్ఫర్లకు అత్యుత్తమ మౌలిక సదుపాయాలను కల్పించడం వంటి అంశాలపై ఈ సమ్మిట్‌లో చర్చించారు.