UPI | పండుగ (Diwali festival) సీజన్ కావడంతో అక్టోబర్ నెలలో డిజిటల్ చెల్లింపులు (Digital payments) సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయి. ముఖ్యంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీలు మునుపెన్నడూ లేనంతగా పెరిగి ఆల్-టైమ్ రికార్డు (All time record)లను సృష్టించాయి.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. అక్టోబర్ నెలలో యూపీఐ ద్వారా జరిగిన లావాదేవీలు 20.70 బిలియన్లుగా నమోదైంది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే లావాదేవీల సంఖ్యలో 25 శాతం వృద్ధి నమోదైంది. విలువ పరంగా చూస్తే అక్టోబర్లో రూ.27.28 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి. ఇక రోజువారీ లావాదేవీల విలువ సగటున రూ.87,993 కోట్లుగా ఉంది (668 మిలియన్లు). ఇది గతేడాదితో పోలిస్తే 16 శాతం అధికం.
ఇక గతనెల యూపీఐ ద్వారా రూ.24.90 లక్షల కోట్ల లావాదేవీలు నమోదైన విషయం తెలిసిందే. సెప్టెంబర్లో రోజూవారీ లావాదేవీల విలువ సగటున రూ.82,991 కోట్లుగా (654 మిలియన్లు) ఉంది. 2016లో సాధారణంగా ప్రారంభమైన యూపీఐ చెల్లింపులు ఇప్పుడు తారాస్థాయికి చేరాయి. 2017 జూన్లో యూపీఐ లావాదేవీల రోజువారీ సగటు 3.5 లక్షలుగా ఉండగా.. ఈ ఏడాది అవి ఆల్టైమ్ రికార్డుకు చేరాయి.
Also Read..
LPG cylinder | వినియోగదారులకు కాస్త ఉపశమనం.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
ముంచిన బ్యాంకింగ్ షేర్లు.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు