LPG cylinder | ధరల మోతతో ఇబ్బంది పడుతున్న గ్యాస్ వినియోగదారులకు దేశీయ చమురు సంస్థలు (Oil Marketing Companies) కాస్త ఉపశమనం కలిగించాయి. హోటల్స్, రెస్టారెంట్స్లో వినియోగించే కమర్షియల్ (Commercial gas) ఎల్పీజీ సిలిండర్ (LPG cylinder) ధరను తగ్గించాయి. 19 కిలోల LPG సిలిండర్ ధర రూ.5 రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ప్రకటించాయి. తగ్గిన ధరలు ముంబై, కోల్కతా, హైదరాబాద్, చెన్నై సహా దేశవ్యాప్తంగా నేటి నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించాయి.
ప్రతి నెల 1వ తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలను సవరిస్తుంటాయి. అందులో భాగంగా ఇవాళ కూడా సవరించిన ధరలను ప్రకటించాయి. తాజా తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,590.50 ఉంది. గతంలో ఇది రూ.1,595.50గా ఉండేది. ఇక కోల్కతాలో రూ.1,694, ముంబైలో రూ.1,542, చెన్నైలో రూ.1,750, హైదరాబాద్లో రూ.1,812.50గా ఉంది. అయితే, గృహ వినియోగం కోసం ఉపయోగించే 14.2 కిలోల సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు జరగలేదు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వంట గ్యాస్ ధర రూ.850 నుంచి రూ.960 మధ్య ఉంది.
Also Read..
ముంచిన బ్యాంకింగ్ షేర్లు.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
నారాయణ హెల్త్ చేతికి బ్రిటన్ హాస్పిటల్స్