బెంగళూరు, అక్టోబర్ 31: బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న నారాయణ హెల్త్ అంతర్జాతీయంగా తన వ్యాపారాన్ని భారీగా విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. బ్రిటన్‌కు చెందిన ప్రాక్టీస్ ప్లస్ గ్రూపు హాస్పిటల్‌ను కొనుగోలు చేసినట్టు ప్రకటించింది. ఒప్పందం విలువ రూ.2,200 కోట్ల స్థాయిలో ఉంటుందని అంచనా. ఈ కొనుగోలుతో నారాయణ హృదాయలయ ఏకంగా బ్రిటన్‌లోకి ప్రవేశించినట్టు అవుతుందని పేర్కొంది.
బ్రిటన్‌లో ప్రాక్టీస్ ప్లస్ గ్రూపు 12 హాస్పిటల్స్, సర్జికల్ సెంటర్లను నిర్వహిస్తున్నది. వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో భాగంగా ఈ కొనుగోలు జరిపినట్టు, దేశీయంగా మూడో అతిపెద్ద ఆదాయ హెల్త్‌కేర్ సంస్థగా తీర్చిదిద్దడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు నారాయణ హెల్త్ ఫౌండర్, చైర్మన్ దేవి ప్రసాద్ శెట్టి తెలిపారు. మరోవైపు, బ్రిటన్‌లో ప్రాక్టీస్ ప్లస్ గ్రూపు ప్రతియేటా 80 వేలకు పైగా సర్జరీలు నిర్వహిస్తున్నది.