Shreyas Iyer | సిడ్నీ వన్డేలో క్యాచ్ అందుకునే క్రమంలో గాయపడిన (injury) టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కోలుకుంటున్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఇక గాయం తర్వాత శ్రేయస్ అయ్యర్ తొలిసారి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా హెల్త్ అప్డేట్ ఇచ్చారు. గాయం నుంచి క్రమంగా కోలుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలిచి, తన ఆరోగ్యం గురించి ఆలోచించిన ప్రతీ ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా పోస్టు పెట్టారు.
Indian Cricketer Shreyas Iyer posts on Instagram, “I’m currently in recovery process and getting better, every passing day. I’m deeply grateful to see all the kind wishes and support I’ve received- it truly means a lot. Thank you for keeping me in your thoughts”
Devajit Saikia,… pic.twitter.com/UTBKqCuojE
— ANI (@ANI) October 30, 2025
కాగా, ఆస్ట్రేలియా (Australia) టూర్లో శ్రేయస్ అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ.. క్యాచ్ అందుకుంటున్న సమయంలో అయ్యర్‌కు గాయమైంది. దీంతో శ్రేయస్ అయ్యర్‌ని సిడ్నీ (Sydney) ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఐసీయూలో రెండురోజలుపాటూ చికిత్స పొందిన ఈ స్టార్ ప్లేయర్.. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. పూర్తిగా కోలుకునేందుకు మూడు వారాలకు పైగా సమయం పట్టనుందని సమాచారం.
మూడో వన్డేలో హర్షిత్ రానా ఓవర్లో అలెక్స్ క్యారీ థర్డ్‌మ్యాన్ దిశలో కొట్టిన బంతిని అయ్యర్ డైవ్ చేస్తూ అందుకున్నాడు. సూపర్ క్యాచ్ పట్టిన అతడు.. ఆ తర్వాత ఎడమవైపు పక్కటెముల నొప్పితో విలవిల్లాడాడు. దాంతో, ఫీజియో వచ్చి పరీక్షించాడు.. అయినా ఉపశమనంగా లేకపోవడంతో అయ్యర్ బాధపడుతూనే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. అతడికి స్కానింగ్ పరీక్షలు జరిపిన వైద్యలు.. పెద్ద ప్రమాదమేమీ లేదని తేల్చడంతో భారత మేనేజ్మెంట్, అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. నవంబర్ ఆఖర్లో దక్షిణాఫ్రికాతో జరుగబోయే మూడు వన్డేల సిరీస్ లోపు అయ్యర్ కోలుకునే అవకాశముంది. స్వదేశంలో నవంబర్ 30, డిసెంబర్ 3, డిసెంబర్ 6వ తేదీన సఫారీ టీమ్‌తో టీమిండియా తలపడనుంది.
Also Read..
జాతీయస్థాయి క్రీడాటోర్నీకి స్టాలిన్ నాయక్
కంగారూలను జయిస్తేనే.. నేడు ఆసీస్‌తో భారత్ కీలక పోరు