దుబాయ్ : కెరీర్ చరమాంకంలో ఉన్న టీమ్ఇండియా మాజీ సారథి రోహిత్ శర్మ తన సుదీర్ఘ కెరీర్లో తొలిసారి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో ఓ హాఫ్ సెంచరీతో పాటు శతకం బాదిన హిట్‌మ్యాన్..
ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి 781 రేటింగ్ పాయింట్లతో నెంబర్ వన్ ర్యాంకుకు చేరుకున్నాడు. 38 ఏండ్ల వయసులో ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాటర్‌గా రోహిత్ రికార్డులకెక్కాడు. గిల్ మూడో స్థానానికి పడిపోయాడు.