భూపాలపల్లి రూరల్, అక్టోబర్ 29 : జాతీయస్థాయి క్రాస్ కంట్రీ రేస్ టోర్నీకి భూపాలపల్లికి చెందిన స్టాలిన్ నాయక్ ఎంపికయ్యాడు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్టాలిన్ ఇటీవల కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించిన ఇంటర్ కాలేజ్ టోర్నీ(ఐసీటీ)లో అద్భుత ప్రతిభ కనబరిచాడు.
ఈ విషయాన్ని డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ రమణారావు, ఇన్చార్జ్ పీడీ కుమారస్వామి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.