Chia Seeds | చియా విత్తనాలను తింటున్నారా..? అయితే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..!
ప్రస్తుత కాలంలో అపారమైన ప్రజాదారణ పొందిన గింజల్లో చియా విత్తనాలు ఒకటి. వీటి వాడకం ప్రస్తుత కాలంలో ఎక్కువైందని చెప్పవచ్చు. చియా గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి.
Chia Seeds | ప్రస్తుత కాలంలో అపారమైన ప్రజాదారణ పొందిన గింజల్లో చియా విత్తనాలు ఒకటి. వీటి వాడకం ప్రస్తుత కాలంలో ఎక్కువైందని చెప్పవచ్చు. చియా గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వీటిని తీసుకోవడం వల్ల శక్తి స్థాయిలు రోజంతా సమతుల్యంగా నిర్వహించబడతాయి. చియా గింజలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఇవి అందరికీ ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ బీపీ తక్కువ ఉన్నవారు వీటిని తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.
బీపీ తక్కువగా ఉంటే..
దాదాపుగా చియా విత్తనాలు అందరికీ సురక్షితం అయినప్పటికీ తక్కువ బీపీ ( హైపోటెన్షన్) ఉన్న వారు ఈ విత్తనాలను తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీటిలో ఫైబర్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి బీపీని స్వల్పంగా తగ్గిస్తాయి. తక్కువ బీపీ ఉన్నవారు వీటిని తీసుకోవడం వల్ల బీపీ మరింత తగ్గే అవకాశం ఉంటుంది. తల తిరగడం, స్పృహ కోల్పోవడం, బలహీనంగా అనిపించడం వంటి లక్షణాలను అనుభవించే వారు చియా విత్తనాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ లక్షణాలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కనుక చియా విత్తనాలను తగిన మోతాదులో మితంగా తీసుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. అలాగే వీటిని తీసుకున్న తరువాత శరీరంలో కనిపించే లక్షణాలను గమనిస్తూ ఉండాలని కూడా వారు సూచిస్తున్నారు.
బీపీపై ప్రభావం చూపే అవకాశం..
ఇక యాంటీ హైపర్టెన్సివ్ మందులను వినియోగించే వారు చియా విత్తనాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం చాలా అవసరమని కూడా వారు తెలియజేస్తున్నారు. బీపీ సంఖ్యలపై చియా విత్తనాలు ప్రభావం చూపిస్తాయని కనుక వీటిని తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని వారు చెబుతున్నారు. వీటిలో ఉండే ఫైబర్ రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు వాపును తగ్గించడంలో, రక్తనాళాల వశ్యతను మెరుగుపరచడంలో, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి రక్తపోటును తగ్గిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల సిస్టోలిక్ బీపీ తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ విధంగా చియా విత్తనాలు బీపీపై ప్రభావాన్ని చూపిస్తాయని వైద్యులు చెబుతున్నారు.
కొన్ని సూచనలు అవసరం..
ఇక వీటిని తీసుకునే విషయంలో కొన్ని సూచనలను పాటించడం మంచిదని కూడా వారు చెబుతున్నారు. చియా విత్తనాలను ఎల్లప్పుడూ నానబెట్టి నీటితో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థలో అసౌకర్యం తగ్గుతుంది. అలాగే వీటిని మొదటగా చిన్న మొత్తంలో తీసుకోవాలి. ముందుగా ఒక టీ స్పూన్ మోతాదులో ప్రారంభించాలి. అలాగే వీటిని తీసుకున్న తరువాత శరీరంలో కనిపించే లక్షణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. శరీర ఆరోగ్య విషయంలో చిన్న మార్పులను గమనించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. చియా గింజలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ లో-బీపీతో బాధపడే వారు వీటిని తీసుకునే విషయంలో జాగ్రత్తలు వహించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Chia seeds
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

