హైదరాబాద్ : కడియం శ్రీహరి ( Kadiyam Srihari ) అంటే కమిట్మెంట్ కాదని వెన్నుపోటు దారుడని ( Backstabber ) బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ( Narendhar ) విమర్శించారు. తెలంగాణ భవన్లో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు వంచన చేరి పదేళ్లు మంత్రి పదవులు అనుభవించాడని ఆరోపించారు. అనంతరం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరి ఎంపీ, ఎమ్మెల్సీ, డిప్యూటీ సీఎం పదవులు పొంది చివరకు కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచి రేవంత్ రెడ్డి వద్దకు చేరి బిడ్డను ఎంపీ చేశారని వెల్లడించారు.
క డియం శ్రీహరి లాంటి రాజకీయ కుట్రదారు ఎవరూ లేరని అన్నారు. రాజకీయ అధికారం కోసం ఎన్ని పార్టీలైన మారుస్తారని, ఇక చివరకు మిగిలింది కమ్యూనిస్టు పార్టీలేనని అన్నారు. ఫోన్లో సిమ్స్ మార్చినట్లు పార్టీలు మార్చడం ఆయనకు అలవాటేనని అన్నారు.డొక్కు స్కూటర్ మీద వచ్చిన కడియం శ్రీహరికిభూములు,పెట్రోల్ బంక్, ఇండ్లు ఎక్కడి నుంచి వచ్చాయో వెల్లడించాలని డిమాండ్ చేశారు. నాడు అనేక మంది దళితులను ఎన్ కౌంటర్ చేయించారని పేర్కొన్నారు.
కడియం శ్రీహరికి ఇజ్జత్ ఉంటే బీఆర్ఎస్ బీ ఫామ్‌పై గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కడియం కుట్రలు తెలిసి కేసీఆర్ రెండవ సారి మంత్రి పదవి ఇవ్వలేదని స్పష్టం చేశారు.తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు జాతిపిత ఇచ్చారని వెల్లడించారు. కేసీఆర్ కాళ్లు కడిగి నెత్తిన చల్లుకున్నా కడియం శ్రీహరికి మోక్షం రాదని , అవాక్కులు చెవాక్కులు పేల్చినకడియం శ్రీహరి కేసీఆర్‌కు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.