– హాజరైన మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్
దేవరకొండ రూరల్, ఫిబ్రవరి 14 : దేవరకొండ మండలం పడమటిపల్లి గ్రామంలో గల శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రథమ వార్షికోత్సవం శనివారం వైభవంగా ప్రారంభమైంది. స్వామి వారిని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్ రెడ్డి, సర్పంచ్ పల్లా శ్రీకాంత్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, సంకు కొండల్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, వాజిద్ పాషా పాల్గొన్నారు.