PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిపక్ష కాంగ్రెస్.. విమాన టిక్కెట్లు బుక్ చేసింది. అసోం నుంచి ప్రధాని మోదీ మణిపూర్ వెళ్లేందుకు విమాన టిక్కెట్లు బుక్ చేసినట్లు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా టికెట్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రధాని మోదీ శనివారం అసోంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అయితే, అసోంకు సమీపంలోనే ఉన్న మణిపూర్‌కు ఎందుకు వెళ్లడం లేదని కాంగ్రెస్ ప్రశ్నించింది.
కొంతకాలంగా మణిపూర్ ఆందోళనలతో అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. చాలా ఏళ్లుగా అక్కడ హింస ఆగడం లేదు. అలాంటి చోటుకు ప్రధాని వెళ్లి, శాంతి భద్రతల్ని పరిరక్షించాలని, ప్రజలకు ధైర్యం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి.. అసోం రాష్ట్రానికి ప్రాధాన్యమిచ్చారని, మణిపూర్‌ను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ విమర్శించింది. ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత పవన్ ఖేరా ప్రధానిపై విమర్శలు గుప్పించారు. ‘‘అసోంలోని గుహవటి నుంచి మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు విమానంలో గంటలో వెళ్లొచ్చు. మీరు (మోదీ) ఎన్నికలు జరిగే రాష్ట్రాలకే ప్రాధాన్యం ఇస్తారు. మణిపూర్‌ను అలా వదిలేయకూడదు. 2023 నుంచి ఈ రాష్ట్రం మండుతూనే ఉంది. మీరు ఇవాళ అసోంలో ఉన్నారు. అసోం నుంచి మణిపూర్ గంటలో వెళ్లొచ్చు.

Dear PM @narendramodi,

We understand that poll-bound states are always your top priority. But Manipur should not be abandoned. The state has been burning since 2023 – and it is burning again.

You are already in Assam today. Manipur is just an hour away. Please go there as well.… pic.twitter.com/kW2zBJICSS
— Pawan Khera 🇮🇳 (@Pawankhera) February 14, 2026

దయచేసి అక్కడికి వెళ్లండి. ప్రధాని భరోసా కల్పిస్తే ప్రజలు ధైర్యంగా ఉంటారు. మీరు అక్కడికి వెళ్లేందుకు మేం విమాన టిక్కెట్లు కూడా బుక్ చేశాం. మీ నెంబర్ లేదు కాబట్టి, ఇక్కడ మీ విమాన టిక్కెట్ పోస్ట్ చేస్తున్నా. ఈ టికెట్ వాడుకోండి. ప్రధాని జాగ్రత్తగా చూసుకుంటాడని నిరూపించండి’’ అని పవన్ ఖేరా తన ట్వీట్లో రాసుకొచ్చారు. మణిపూర్‌లో 2023లో కుకీ, మెయిటీ తెగల మధ్య చెలరేగిన ఘర్షణలు ఇంకా తగ్గని సంగతి తెలిసిందే. ఈ ఘటనల్లో 250 మందికిపైగా మరణించారు. ఇదే అంశంలో ప్రధాని, కేంద్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.