ఖమ్మం రూరల్ : కవి, రచయిత, కళాకారుడు, ఉద్యమ నేత కోమాకుల సీతారాములు రచించిన “హాస్టల్ కతలు” పుస్తకావిష్కరణ జులై 26న జరుగనుంది. ఆ రోజు ఉదయం 10. గంటలకు పుస్తకాన్ని ఆవిష్కరిస్తామని బహుజన సాహిత్య వేదిక శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహిచే ఈ కార్యక్రమానికి ప్రముఖ కవి, రచయిత, ఎ. విద్యా సాగర్, ఐ.ఎ.ఎస్, సినీ దర్శకుడు కథ రచయిత స్క్రీన్ ప్లే రచయిత కె.వి అనుదీప్, మరో రచయిత భంగ్య భూక్య హాజరు కానున్నారు.
కాళోజి అవార్డు గ్రహీత ప్రముఖ కవి, రచయిత ఆర్. సీతారాం అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో ప్రసిద్ధ సినీ సంగీత దర్శకులు, గాయకులు, గద్దర్ అవార్డు గ్రహీత భీమ్స్ సిసిరోలియోను ఘనంగా సన్మానిస్తామని బహుజన సాహిత్య వేదిక ప్రకటించింది. ఈ కార్యక్రమంలో కె.సీతారాములుతో పాటు మొగిలి గుణకర్, పందాలు ఐలయ్య, పమ్మి రవి, ఖురుషీద్ పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులు ప్రసేన్, గేజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాస రావు.. కవి, రచయిత అమ్మిన శ్రీనివాస రాజు పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
‘హాస్టల్ కతలు’ పుస్తకావిష్కరణ సభకు మొగిలి వెంకటేశ్వర్లు సమన్వయ కర్తగా వ్యవహరించనున్నారు. కవి, రచయిత, రాచమళ్ల ఉపేందర్ పుస్తక సమీక్ష చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, సాహితీ సంఘాల బాధ్యులు, రచయితలు, కవులు, మేధావులు పాల్గొని జయప్రదం చేయాలని బహుజన సాహిత్య వేదిక ప్రతినిధులు కోరారు.