BRS USA Austin : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట తారకరామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను అమెరికాలో ఘనంగా నిర్వహించారు. తమ అభిమాన నాయకుడు కేటీఆర్ 50 పుట్టిన రోజున బీఆర్ఎస్ యూఎస్ఏ ఆస్టిన్ బృందం స్థానికంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టింది.
‘గిఫ్ట్ ఏ స్మైల్ ఇనిషియేటివ్’లో భాగంగా బీఆర్ఎస్ యూఎస్ఏ ఆస్టిన్ సభ్యులు రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం.. విదేశీ యుద్ధ వీరులకు 700ల అమెరికా డాలర్లు(భారతీయ కరెన్సీలో దాదాపు రూ.70 వేలు) విరాళంగా అందించి ఉదారత చాటుకున్నారు.
