KTR | మేమంతా అండగా ఉంటాం.. మీ పోరాటం ఆపొద్దు.. యువతకు కేటీఆర్ సూచన
KTR | వాట్సాప్ యూనివర్సిటీకి, ఇన్స్టాగ్రామ్ జనరేషన్‌కు పంచాయతీ పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మీ పోరాటం ఈ ఒక్క ధర్నాతోనే.. నిరసనతోనే ముగించవద్దని సూచించారు.
KTR | వాట్సాప్ యూనివర్సిటీకి, ఇన్స్టాగ్రామ్ జనరేషన్‌కు పంచాయతీ పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మీ పోరాటం ఈ ఒక్క ధర్నాతోనే.. నిరసనతోనే ముగించవద్దని సూచించారు. కేంద్రం దిగొచ్చేవరకు పోరాటం చేయాలని అన్నారు. హైదరాబాద్ ఇందిరాపార్క్‌లోని బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ యువతకు భరోసా కల్పించారు. కేసీఆర్ సహా మేమంతా యువతకు అండగా నిలబడతామని స్పష్టం చేశారు.
కేసీఆర్ తెలంగాణం కోసం బయల్దేరిన్నాడు.. అవహేళన చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. 14 ఏళ్లు చావుకు, కేసులకు భయపడకుండా పోరాటం చేశారని తెలిపారు. చావు నోట్లో తలపెట్టి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించారని అన్నారు. కేసీఆరే మనందరికీ స్ఫూర్తి అని అన్నారు. మీ ఆవేదన, ఆక్రందన కూడా కేసీఆర్ చూస్తున్నారని తెలిపారు. అవసరమైతే కేసీఆర్ మీకోసం వస్తారని యువతను ఉద్దేశించి చెప్పారు.
యువత దేశాన్ని కాపాడుకుంటున్నారని కరోనా సమయంలో కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. జెన్‌జీ తిరగబడుతుందని ఏడాది క్రితం తాను కూడా చెప్పానని అన్నారు. ఇవాళ వేల సంఖ్యలో కాక్రోచ్ల మాదిరిగా దండయాత్ర చేశారని తెలిపారు. ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. పరీక్ష లీక్‌పై ఎందుకు మాట్లాడవని ప్రశ్నిస్తున్నారని అన్నారు. విశ్వ గురువైన ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడతలేవని అడుగుతున్నారని చెప్పారు.
25 రోజులుగా ఎక్కడికి పోయారని మీడియాను యువత గల్లాపట్టి అడిగారని కేటీఆర్ తెలిపారు. ఇక మీడియా, స్లాటర్ హౌస్‌లతో రాజకీయం నడపలేరని అన్నారు. వాట్సాప్ యూనివర్సిటీకి ఇన్స్టాగ్రామ్ జనరేషన్‌కు పంచాయతీ పడ్డదని వ్యాఖ్యానించారు. మీ పోరాటం ఒక్క ధర్నాతోనో.. నిరసనతోనో ముగించవద్దని సూచించారు. కేంద్రం దిగొచ్చే వరకు పోరాటం చేయాలని అన్నారు. కేసీఆర్ సహా మేమంతా అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. 119 నియోజకవర్గాల్లో మీకు ఏ సహాయం కావాలన్నా చేస్తామని స్పష్టం చేశారు. ఈ పోరాటం ఫలించే వరకు మీతో కలిసి నడుస్తామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్‌వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

