Road Accident | నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగెం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై కారును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ఏడుగురు దుర్మరణం చెందారు.
రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ వేగంగా కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఢీకొట్టిన తర్వాత కారును టిప్పర్ కొద్దిదూరం లాక్కెళ్లింది. టిప్పర్ కిందకు కారు వెళ్లిపోవడంతో మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. కారు నెల్లూరు నుంచి కడపకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదం గురించి సమాచారం అందుకోగానే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.