Sinners On Jio Hotstar | హాలీవుడ్ బ్లాక్ బస్టర్ హారర్ చిత్రం ‘సిన్నర్స్’ ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్‌లో ఈ చిత్రం సెప్టెంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు బుక్‌మైషో స్ట్రీమ్‌లో అద్దెకు (rent) అందుబాటులో ఉన్నప్పటికీ తాజాగా జియోలో ఉచితంగా అందుబాటులోకి రాబోతుంది.
హాలీవుడ్ నటుడు మైఖేల్ బి. జోర్డాన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించగా.. హైలీ స్టెయిన్‌ఫీల్డ్, మైల్స్ క్యాటన్, జాక్ ఓ’కొన్నెల్, జేమీ లాసన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ర్యాన్ కూగ్లర్ దర్శకత్వం వహించగా.. లుడ్విగ్ గోరాన్సన్ సంగీతం అందించాడు. ఏప్రిల్ 18, 2025న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా $350 మిలియన్లకు పైగా వసూలు చేసింది. అయితే చాలా రోజులుగా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఊరిస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేసింది. జియో హాట్‌స్టార్‌లో రేపటినుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది.
ఈ సినిమా ఇద్దరు కవల సోదరుల చుట్టూ తిరుగుతుంది. స్మోక్, స్టాక్ అనే కవల సోదరులు తమ సొంత పట్టణానికి తిరిగి వచ్చిన అనంతరం అక్కడ జరిగిన పరిణామలు ఏంటి అనేది ఈ సినిమా కథ.
Some stories are written in blood.
Sinners, streaming 18 September onwards on JioHotstar. pic.twitter.com/ZjgAaRK5NH
— JioHotstar (@JioHotstar) September 16, 2025