హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఏపీ శాసనమండలి చైర్మన్కు ఆ రాష్ట్ర హైకోర్టు రూ.10 వేల జరిమానా విధించింది. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామాను ఆమోదించేలా ఉత్తర్వులు జారీచేయాలనే కేసులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకపోవడంతో కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.10వేలు చెల్లించాలని మండలి చైర్మన్కు సూచించింది.
కౌంటర్ పిటిషన్ దాఖలుచేయని శాసనమండలి చైర్మన్ తీరును తప్పుపట్టింది. గతంలో ఆదేశించినప్పటికీ కౌంటర్ వేయకపోగా మళ్లీ గడువు కావాలని కోరడంపై అసంతృప్తి వ్యక్తంచేసింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు.