MLA Rajagopal Reddy | హైదరాబాద్ : నేపాల్ తరహాలో యువత తిరగబడి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేయడం ఖాయమని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గన్‌పార్కు వద్ద నిరుద్యోగ అభ్యర్థులతో కలిసి అమరవీరుల స్థూపానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారని, మాకు న్యాయం జరుగుతుందని నిరుద్యోగులు భావించారు.. కానీ అనుకున్న స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను నిలువునా మోసం చేసింది అని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు.
నేపాల్ తరహాలో యువత తిరగబడి మన ప్రభుత్వాన్ని కూల్చేయడం ఖాయం. నిరుద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వం మనుగడ సాధించలేదు. నిరుద్యోగులను గాలికి వదిలేయొద్దు.. వారికి దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.
నేపాల్ తరహాలో యువత తిరగబడి మన ప్రభుత్వాన్ని కూల్చేయడం ఖాయం
మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నిరుద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వం మనుగడ సాధించలేదు
నిరుద్యోగులను గాలికి వదిలేయొద్దు.. వారికి దారి చూపించాల్సిన బాధ్యత ఈ… pic.twitter.com/jjYRTBEDur
— Telugu Scribe (@TeluguScribe) September 17, 2025