వెంగళరావునగర్, అక్టోబర్ 12: ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీయాలని మాజీ మంత్రి,ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఓటర్లకు సూచించారు. ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని శ్రీనగర్ కాలనీ,ఎల్లారెడ్డిగూడలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజలకు కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. కిరాణ దుకాణం నిర్వహిస్తున్న ఓ మహిళను ఆమె పలకరించి కాంగ్రెస్ పాలన ఎలా ఉందని ప్రశ్నించగా..చిరు వ్యా పారులైన తమ దుకాణాలను బల్దియా అధికారులు కూల్చివేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాం నుంచి తమకు రూ.2వేలు సాయం వస్తుందని..కాంగ్రెస్ రూ.4వేలు ఇస్తామని చెప్పి మాట తప్పిందని సబిత దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతం అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడ్డ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబానికి అండగా ఉండాలని..మాగంటి సతీమణి, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని..ఒకప్పుడు దేశంలోనే అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ ఉండేదని.. హై డ్రాను తీసుకొచ్చి పేదల ఇండ్లను కూల్చేస్తున్నార ని..నగర ప్రతిష్టను కాంగ్రెస్ నాయకులు దెబ్బతీశారని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్కు బు ద్ధి చెప్పాలని సూచించారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి,మాజీ కార్పొరేటర్ మహేశ్ యాదవ్,బీఆర్ఎస్ నేతలు,షేక్ అహ్మద్,డివిజన్ అధ్యక్షుడు అప్పుఖాన్,కార్యదర్శి మధు యాద వ్,వైస్ ప్రెసిడెంట్ అవినాశ్ కౌడ్ పాల్గొన్నారు.