కొండాపూర్, అక్టోబర్ 12 : మద్యం మత్తులో కానిస్టేబుల్ హల్చల్ చేశాడు. ఆదివారం రాత్రి చందానగర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ (Miyapur Police Staiton)లో కోర్టు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఏం.రాఘవేందర్ (M Raghavender) మద్యం సేవించి కారు నడుపుతూ.. మరో కారుని ఢీకొట్టాడు. అంతటితో ఆగకుండా సదరు వాహనదారులను దుర్భషలాడుతూ వారి పైకి దాడి చేసేందుకు వెళ్ళాడు. మద్యం మత్తులో ఉన్న ఆతడు తాను పోలీసునంటూ వాళ్లను బెదిరించాడు. అటుగా వెళ్తున్న వాహనదారులు రాఘవేందర్‌ను అడ్డుకుని పోలీసులకు అప్పగించినట్టు సమాచారం.