హామీలపై కాంగ్రెస్‌ను నిలదీయండి
ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీయాలని మాజీ మంత్రి,ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఓటర్లకు సూచించారు. ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని శ్రీనగర్ కాలనీ,ఎల్లారెడ్డిగూడలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించారు.
- ఉప ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్పాలి
- మాగంటి కుటుంబానికి అండగా ఉండాలి
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
వెంగళరావునగర్, అక్టోబర్ 12: ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీయాలని మాజీ మంత్రి,ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఓటర్లకు సూచించారు. ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని శ్రీనగర్ కాలనీ,ఎల్లారెడ్డిగూడలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజలకు కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. కిరాణ దుకాణం నిర్వహిస్తున్న ఓ మహిళను ఆమె పలకరించి కాంగ్రెస్ పాలన ఎలా ఉందని ప్రశ్నించగా..చిరు వ్యా పారులైన తమ దుకాణాలను బల్దియా అధికారులు కూల్చివేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాం నుంచి తమకు రూ.2వేలు సాయం వస్తుందని..కాంగ్రెస్ రూ.4వేలు ఇస్తామని చెప్పి మాట తప్పిందని సబిత దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతం అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడ్డ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబానికి అండగా ఉండాలని..మాగంటి సతీమణి, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని..ఒకప్పుడు దేశంలోనే అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ ఉండేదని.. హై డ్రాను తీసుకొచ్చి పేదల ఇండ్లను కూల్చేస్తున్నార ని..నగర ప్రతిష్టను కాంగ్రెస్ నాయకులు దెబ్బతీశారని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బు ద్ధి చెప్పాలని సూచించారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి,మాజీ కార్పొరేటర్ మహేశ్ యాదవ్,బీఆర్ఎస్ నేతలు,షేక్ అహ్మద్,డివిజన్ అధ్యక్షుడు అప్పుఖాన్,కార్యదర్శి మధు యాద వ్,వైస్ ప్రెసిడెంట్ అవినాశ్ కౌడ్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Pimples | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
‘యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి’
Tirumala | నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం..ఆర్జిత సేవలు రద్దు
పరీక్షలో చీటింగ్ కోసం.. శానిటరీ నాప్కిన్లో పరికరం ఉంచి లోదుస్తుల్లో దాచిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

