Rythu Nestham | జహీరాబాద్, జూన్ 16 : రైతులకు అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో సేవలందించడం కోసం రైతు నేస్తం కార్యక్రమం ఎంతగానో మేలు చేస్తుందని సెట్విన్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గిరిధర్‌రెడ్డి అన్నారు.
సోమవారం జహీరాబాద్ మండలంలోని రంజోల్, కోత్తూర్(బి), న్యాల్కల్ మండలంలోని మామిడ్గి గ్రామాల్లోని రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసారం అయ్యే వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు, సలహాల మేరకు పంటలను పండించి అధిక దిగుబడులను సాధించే విధంగా రైతులు కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్‌చైర్మన్ సాయిచరణ్, తిరుపతిరెడ్డి, వ్యవసాయ సహాయ సంచాలకులు బిక్షపతి, వ్యవసాయాధికారులు లావణ్య, అవినాశ్‌వర్మ, విస్తరణ అధికారులు ప్రదీప్‌కుమార్, వీరేందర్, ప్రసంతి, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Inter Results | ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఫస్టియర్‌లో 67.. సెకండియర్‌లో 50శాతం పాస్
OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఉప్పు కప్పురంబు.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..!
Narsimhulapeta | ఖాజామియాకు ఆర్థిక సాయం అందజేత