గజ్వేల్, జూలై 3: రైతులు, యువత అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి సూచించారు. ఆర్వీఎం మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ‘రైతు భద్రతపై అవగాహన’ ర్యాలీ నిర్వహించగా బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వంటేరు మాట్లాడుతూ తొందర పాటుతో ఆత్మహత్యలకు పాల్పడితే విలువైన జీవితం నాశనమవుతుందన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా మానసికంగా ఇబ్బందిపడకుండా వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు.
ప్రేమ పేరుతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. పదేండ్లలో కేసీఆర్ రైతులకు భరోసా కల్పించేలా రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. రైతులు ఎదగాలనే ఉద్దేశంతో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీళ్లు అందించడంతో అత్యధికంగా ధాన్యం దిగుబడి వచ్చిం దన్నారు. ఆనాడు రైతులు ధైర్యంతో పంటలు సాగు చేసుకునేలా ఆత్మైస్థెర్యం కల్పించారన్నారు. విద్యార్థులు, యువత కూడా ఆత్మహత్యలపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ చందన, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఆర్వీఎం దవాఖాన నిర్వాహకులు శ్రీనివాస్, శ్రవణ్, శ్రీధర్, సురేశ్, నాయకులు పాల్గొన్నారు.