అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు
రైతులు, యువత అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి సూచించారు. ఆర్వీఎం మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ‘రైతు భద్రతపై అవగాహన’ ర్యాలీ నిర్వహించగా బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసంగించారు.
- రైతు భద్రత కోసమే రైతు బంధు
- కర్షకుల కోసం ఆలోచించింది గులాబీ అధినేత కేసీఆరే
- బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి
గజ్వేల్, జూలై 3: రైతులు, యువత అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి సూచించారు. ఆర్వీఎం మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ‘రైతు భద్రతపై అవగాహన’ ర్యాలీ నిర్వహించగా బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వంటేరు మాట్లాడుతూ తొందర పాటుతో ఆత్మహత్యలకు పాల్పడితే విలువైన జీవితం నాశనమవుతుందన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా మానసికంగా ఇబ్బందిపడకుండా వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు.
ప్రేమ పేరుతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. పదేండ్లలో కేసీఆర్ రైతులకు భరోసా కల్పించేలా రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. రైతులు ఎదగాలనే ఉద్దేశంతో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీళ్లు అందించడంతో అత్యధికంగా ధాన్యం దిగుబడి వచ్చిం దన్నారు. ఆనాడు రైతులు ధైర్యంతో పంటలు సాగు చేసుకునేలా ఆత్మైస్థెర్యం కల్పించారన్నారు. విద్యార్థులు, యువత కూడా ఆత్మహత్యలపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ చందన, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఆర్వీఎం దవాఖాన నిర్వాహకులు శ్రీనివాస్, శ్రవణ్, శ్రీధర్, సురేశ్, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఇంకా ఆ వరుసలో చాలా మంది ఉన్నారు.. కొండా సురేఖ క్షమాపణలపై కేటీఆర్
CPM | తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం రూ.50 వేల కోట్లు నష్టపరిహారంగా అందించాలి : సీపీఎం
YCP Letter | ఏపీలో పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైసీపీ లేఖ
Ramayana | పాకిస్తాన్‌లోనూ తగ్గేదేలే అంటున్న ‘రామాయణ’ క్రేజ్.. కరాచీ వీడియో వైరల్!
TVK leader arrested | వర్షంలో లిఫ్ట్ ఇచ్చే నెపంతో.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన టీవీకే నేత
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

