Rudreshwara Swamy | హనుమకొండ చౌరస్తా, జనవరి 17: చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో మాసశివరాత్రి పురస్కరించుకొని రుద్రేశ్వరస్వామికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించి మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ముందస్తు మొక్కులకు తరలివెళ్తున్న భక్తులు దేవాలయాన్ని సందర్శించి రుద్రేశ్వరునికి రుద్రాభిషేకాలు నిర్వర్తించుకున్నారు. వారికి సామూహిక రుద్రాభిషేకాలు నిర్వర్తించారు.
ప్రతి సంవత్సరం మాదిరిగానే సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్తున్న భక్తులు ఈ రుద్రేశ్వరుని దర్శించుకొని ముందస్తు మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని మాసశివరాత్రిని పురస్కరించుకొని రుద్రేశ్వరీ-రుద్రేశ్వరస్వామివార్లకు మాసకల్యాణోత్సవం అత్యంత వైభవంగా ఆగమానుసారంగా కల్యాణోత్సవం నిర్వహించారు. అనంతరం భక్తులకు తలంబ్రాలు అందజేశారు.
ఈ పూజా కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బంధువులు కూడా కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. 11 మాస శివరాత్రులు ఈ రోజుతో పూర్తయి వచ్చే నెల మాఘమాసంలో 15న మహాశివరాత్రి వస్తుందని ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేందర్శర్మ తెలిపారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అర్చకులు గంగు మణికంఠశర్మ, ప్రణవ్శర్మ, సిబ్బంది సేవలందించారు.
Konaseema | కోనసీమలో రికార్డింగ్ డ్యాన్స్ కలకలం.. డాన్సర్లను బట్టలు విప్పమన్న జనసేన నేత!