కుభీర్ : కుభీర్ మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో శనివారం సీఎం కప్ ( CM Cup) క్లస్టర్ స్థాయి 2వ అడిషన్ వాలీబాల్, కబడ్డీ, ఖోఖో క్రీడల పోటీలను ఎంపీడీవో గంగా సాగర్ రెడ్డి ( Ganga Sagar reddy ) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని పేర్కొన్నారు. క్రీడలు శారీరక దారుఢ్యానికి, మానసిక ఆరోగ్య పరిరక్షణకు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.

క్రీడలు నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని, క్రీడల్లో గెలుపోటములు సహజమని ఓటమిని పూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో విజయ్ కుమార్, పాఠశాల హెచ్ఎం సట్ల గంగాధర్, ఎస్సై కృష్ణారెడ్డి, పీడి క్రాంతి, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.