Rudreshwara Swamy | మాసశివరాత్రి ప్రత్యేకం.. ఆగమానుసారంగా రుద్రేశ్వరస్వామి కళ్యాణోత్సవం
Rudreshwara Swamy | ప్రతి సంవత్సరం మాదిరిగానే సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్తున్న భక్తులు ఈ రుద్రేశ్వరుని దర్శించుకొని ముందస్తు మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని మాసశివరాత్రిని పురస్కరించుకొని రుద్రేశ్వరీ-రుద్రేశ్వరస్వామివార్లకు మాసకల్యాణోత్సవం అత్యంత వైభవంగా ఆగమానుసారంగా కల్యాణోత్సవం నిర్వహించారు.
Rudreshwara Swamy | హనుమకొండ చౌరస్తా, జనవరి 17: చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో మాసశివరాత్రి పురస్కరించుకొని రుద్రేశ్వరస్వామికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించి మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ముందస్తు మొక్కులకు తరలివెళ్తున్న భక్తులు దేవాలయాన్ని సందర్శించి రుద్రేశ్వరునికి రుద్రాభిషేకాలు నిర్వర్తించుకున్నారు. వారికి సామూహిక రుద్రాభిషేకాలు నిర్వర్తించారు.
ప్రతి సంవత్సరం మాదిరిగానే సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్తున్న భక్తులు ఈ రుద్రేశ్వరుని దర్శించుకొని ముందస్తు మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని మాసశివరాత్రిని పురస్కరించుకొని రుద్రేశ్వరీ-రుద్రేశ్వరస్వామివార్లకు మాసకల్యాణోత్సవం అత్యంత వైభవంగా ఆగమానుసారంగా కల్యాణోత్సవం నిర్వహించారు. అనంతరం భక్తులకు తలంబ్రాలు అందజేశారు.
ఈ పూజా కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బంధువులు కూడా కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. 11 మాస శివరాత్రులు ఈ రోజుతో పూర్తయి వచ్చే నెల మాఘమాసంలో 15న మహాశివరాత్రి వస్తుందని ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేందర్శర్మ తెలిపారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అర్చకులు గంగు మణికంఠశర్మ, ప్రణవ్శర్మ, సిబ్బంది సేవలందించారు.
Read Also
Sunita Ahuja | గోవిందాకు భార్య సునీత వార్నింగ్.. 63 ఏళ్లు వచ్చాయి.. ఇప్పటికైనా మారకపోతే క్షమించను! :
Konaseema | కోనసీమలో రికార్డింగ్ డ్యాన్స్ కలకలం.. డాన్సర్లను బట్టలు విప్పమన్న జనసేన నేత!
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

