రామవరం, సెప్టెంబర్ 02 : కార్మిక ప్రాంతమైన రుద్రంపూర్ ఈద్గా వద్ద ప్రధాన నీటి వనరు అయిన చేతి పంపు గత కొంతకాలంగా పని చేయడం లేదు. ముస్లింలు వారి ఇళ్లలో ఎవరైనా కాలం చేస్తే అంత్యక్రియలు ఇక్కడే నిర్వహిస్తారు. అంత్యక్రియలు నిర్వహించే సమయంలో అవసరానికి, పండుగ పూటలో నమాజు చేయడానికి వచ్చేవారికి, అలాగే అటవీ ప్రాంతంలో ఏదైనా అవసరం వచ్చే వారు తాగునీటికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. విషయాన్ని గ్రామ పంచాయతీ సెక్రటరీ నరేందర్ దృష్టికి తీసుకువెళ్లగా సత్వర చర్యలు తీసుకున్నారు. హ్యాండ్ పంప్‌కు మరమ్మతులు చేయించారు. ఈ చర్యపై ముస్లింలు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.