లక్ష్మీదేవిపల్లి, సెప్టెంబర్ 02 : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విచారణను కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పిలుపుమేరకు పార్టీ శ్రేణులు మంగళవారం లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు కోరం చంద్రశేఖర్, తాడూరు రజాక్, మాజీ వార్డు సభ్యులు శ్రీకాంత్ నాయక్, చిర్రా వెంకన్న, పొదిలి వెంకటాచలం, గోన సురేశ్, మైనార్టీ అధ్యక్షుడు ఇక్బాల్ పాషా, మండల ప్రచార కార్యదర్శి బట్టు కనకరాజు, బీఆర్ఎస్ మండల నాయకులు కొంపల్లి వెంకన్న పూర్ణాచారి, లావుడియా వెంకటేశ్, బోడ మంగ్య , బట్టు హుస్సేన్, బుక్య హుస్సేన్, బుక్య, తరాల మల్లేశ్, తరాల దాము, తరాల మహేశ్, జక్కుల శ్రీనివాస్, మేకల కోటేశ్వరరావు, నాగేందర్, మాలోత్ రాంజీ, రాజు పాల్గొన్నారు.