Anti Paper Leak Bill | నీట్-యూజీ పేపర్ లీక్ (Paper Leak) వ్యవహారం ఇటీవలే దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీహార్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు, ప్రభుత్వ నియామక పోటీ పరీక్షల్లో అక్రమాలను నియంత్రించేందుకు కీలక బిల్లును (Anti Paper Leak Bill) తీసుకొచ్చింది.
సీట్ పేపర్ లీక్, అక్రమాలకు బీహార్ రాష్ట్రం కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రశ్నపత్రాల లీక్‌లు, ఇతర అవకతవకలను అరికట్టడానికి నితీశ్ కుమార్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బీహార్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు – 2024ను అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ (Bihar Assembly) వ్యవహారాల మంత్రి విజయ్ కుమార్ చౌదరి సభలో బిల్లును ప్రవేశపెట్టారు.
అయితే, అసెంబ్లీ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేయగా.. మూజువాణి ఓటుతో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. తాజా బిల్లు ప్రకారం.. ప్రభుత్వ నియామక పోటీ పరీక్షల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉండనున్నాయి. మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. అంతేకాదు రూ.10లక్షల జరిమానాతోపాటు కఠిన శిక్షను అమలు చేయనున్నారు.
Also Read..
Lalu Prasad Yadav | క్షీణించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం.. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స
Plane Crashe | కాఠ్మాండూ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎలా కూలిందో చూడండి.. వైరలవుతున్న వీడియోలు