Nirmala Sitharaman | బడ్జెట్ ప్రసంగంలో అన్ని రాష్ట్రాల పేర్లనూ ప్రస్తావించలేం.. అలా అని విస్మరించినట్లేనా..? : నిర్మలమ్మ
Nirmala Sitharaman | 2024 బడ్జెట్‌పై విపక్షాల ఆరోపణలకు విత్త మంత్రి నిర్మలమ్మ ధీటుగా బదులిచ్చారు. బడ్జెట్లో ఏ రాష్ట్రాన్నీ విస్మరించలేదని (No state ignored) స్పష్టం చేశారు. బడ్జెట్ ప్రసంగంలోనే అన్ని రాష్ట్రాల పేర్లను చెప్పలేమంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు.
Nirmala Sitharaman | తమ ప్రభుత్వ లక్ష్యాలను వివరిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ (Nirmala Sitharaman) ఈ ఆర్థిక ఏడాది 2024-25కి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను మంగళవారం పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. వరుసగా ఏడోసారి వార్షిక పద్దును ప్రవేశపెట్టిన ఆమె వికసిత్ భారత్ లక్ష్యసాధనలో భాగంగా అన్ని రంగాల్లో ఉద్యోగ, ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. రూ. 48.21 లక్షల కోట్ల అంచనాలతో వార్షిక పద్దును ఉభయ సభల ముందుకు తీసుకెళ్లారు. అయితే, కేంద్ర వార్షిక బడ్జెట్‌పై విపక్ష ‘ఇండియా’ కూటమి సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2024 బడ్జెట్ వివక్షపూరితంగా ఉందని, విపక్ష పార్టీలు పాలించే రాష్ట్రాలపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిందని ధ్వజమెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో విపక్షాల ఆరోపణలకు విత్త మంత్రి నిర్మలమ్మ ధీటుగా బదులిచ్చారు.
ఇవాళ రాజ్యసభలో ప్రసంగించిన నిర్మలమ్మ బడ్జెట్లో ఏ రాష్ట్రాన్నీ విస్మరించలేదని (No state ignored) స్పష్టం చేశారు. బడ్జెట్ ప్రసంగంలోనే అన్ని రాష్ట్రాల పేర్లను చెప్పలేమంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగానే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ‘కేంద్రం ప్రవేశపెట్టే ప్రతీ బడ్జెట్లో దేశంలోని అన్ని రాష్ట్రాల పేర్లనూ ప్రస్తావించే అవకాశం రాదు. నేను చాలా రాష్ట్రాల పేర్లు చెప్పలేదని.. కేవలం రెండు రాష్ట్రాల గురించి మాట్లాడానని మల్లికార్జున ఖర్గే (Kharge)గారు అన్నారు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చాలా కాలం అధికారంలో ఉంది. వాళ్లు చాలా భిన్నమైన బడ్జెట్లను సమర్పించారు. ప్రతి బడ్జెట్ ప్రసంగంలోనూ దేశంలోని అన్ని రాష్ట్రాల పేర్లూ ప్రస్తావించే అవకాశం మీకు లభించదని స్పష్టంగా తెలుసు’ అంటూ నిర్మలమ్మ గట్టి కౌంటర్ ఇచ్చారు.
బడ్జెట్ ప్రసంగంలో ఒక నిర్దిష్ట రాష్ట్రం పేరును ప్రస్తావించని మాత్రానా.. ఆ రాష్ట్రానికి కేంద్రం నిధులు వెళ్లవా..? అని ప్రశ్నించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. మహారాష్ట్రలోని వందవన్‌లో అతి పెద్ద ఓడరేవును ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుందన్నారు. కానీ, నిన్నటి తన బడ్జెట్ ప్రసంగంలో మహారాష్ట్ర పేరును ప్రస్తావించలేదన్నారు. బడ్జెట్ ప్రసంగంలో మహారాష్ట్ర పేరు చెప్పనుందుకు ఆ రాష్ట్రాన్ని విస్మరించినట్లా?.. అలా అని ఆ రాష్ట్రం తమను కేంద్ర విస్మరించిందని భావిస్తోందా..? అని ప్రశ్నించారు. ఆ ప్రాజెక్టుకు రూ.76 వేల కోట్లు ప్రకటించినట్లు ఈ సందర్భంగా నిర్మలమ్మ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రలు చేస్తున్నాయని దుయ్యబట్టారు.
Also Read..
NITI Aayog | బడ్జెట్లో అన్యాయం.. నీతి ఆయోగ్ మీటింగ్‌ను బహిష్కరించిన తెలంగాణ సీఎం
Lok Sabha | మూడో రోజు ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు.. విపక్షాల ఆందోళన
INDIA parties | బడ్జెట్‌కు వ్యతిరేకంగా.. పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి నేతల నిరసన
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

