NITI Aayog | బడ్జెట్లో అన్యాయం.. నీతి ఆయోగ్ మీటింగ్‌ను బహిష్కరించిన తెలంగాణ సీఎం
NITI Aayog | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ (NITI Aayog) సమావేశానికి హాజరు కాకూడదని పలువురు సీఎంలు నిర్ణయించారు.
NITI Aayog | కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ (Union Budget 2024) పై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి (INDIA parties) నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్డీయే కూటమి పార్టీల పాలిత రాష్ట్రాలకు మాత్రం ఈ బడ్జెట్లో మోదీ సర్కార్ వరాలు జల్లు కురిపించింది. ఏపీ, బీహార్ రాష్ట్రాలకు మాత్రమే ఈ బడ్జెట్లో కేంద్రం పెద్దపీట వేసింది. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వ వైఖరిపై మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 27న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ (NITI Aayog) సమావేశానికి హాజరు కాకూడదని పలువురు సీఎంలు నిర్ణయించారు.
ఇందులో ముగ్గురు కాంగ్రెస్ పాలిత సీఎంలు కాగా, ఒకరు తమిళనాడు సీఎం స్టాలిన్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు నీతి ఆయోగ్ మీటింగ్‌కు హాజరు కావడం లేదు. బడ్జెట్లో ప్రతిపక్ష రాష్ర్టాలపై మోదీ సర్కార్ వివక్ష చూపారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా తమ పార్టీ ముఖ్యమంత్రులు ముగ్గురు ఈ సమావేశానికి హాజరు కారని స్పష్టం చేశారు.
ఇక నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మంగళవారం సాయంత్రం ప్రకటించారు. బడ్జెట్లో కేంద్రం చూపిన వైఖరిపై బెంగాల్, కేరళ ముఖ్యమంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ.. వారు నీతి ఆయోగ్ సమావేశం గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.
Also Read..
Kamala Harris: తమిళనాడులోని పూర్వీకుల గ్రామంలో కమలా హ్యారిస్ పోస్టర్లు.. వీడియో
Lok Sabha | మూడో రోజు ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు.. విపక్షాల ఆందోళన
Puja Khedkar: ముగిసిన డెడ్‌లైన్.. ఐఏఎస్ అకాడమీకి రిపోర్టు చేయని పూజా ఖేద్కర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

