Puja Khedkar: ముగిసిన డెడ్‌లైన్.. ఐఏఎస్ అకాడమీకి రిపోర్టు చేయని పూజా ఖేద్కర్
Puja Khedkar: వివాదాస్పద ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్.. లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో జూలై 23వ తేదీ వరకు రిపోర్టు చేయాల్సి ఉంది. కానీ మంగళవారం ఆమె అకాడమీ వద్ద రిపోర్టు చేయలేదు. వివాదం తీవ్ర కావడంతో.. అకాడమీకి రావాలంటూ రీకాల్ చేశారు. ఆమె శిక్షణ కార్యక్రమాన్ని కూడా హోల్డ్‌లో పెట్టేశారు.
న్యూఢిల్లీ: వివాదాస్పద ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్(Puja Khedkar).. నకిలీ దివ్యాంగ, కుల ద్రువీకరణ పత్రాలను సమర్పించిన కేసులో సస్పెన్షన్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ముసోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో జూలై 23వ తేదీ వరకు పూజా ఖేద్కర్ రిపోర్టు చేయాల్సి ఉంది. కానీ మంగళవారం ఆమె అకాడమీ వద్ద రిపోర్టు చేయలేదు. వివాదం తీవ్ర కావడంతో.. అకాడమీకి రావాలంటూ రీకాల్ చేశారు. ఆమె శిక్షణ కార్యక్రమాన్ని కూడా హోల్డ్‌లో పెట్టేశారు. ముసోరిలోని ఎల్బీఎస్ఎన్ఏఏ శిక్షణ సంస్థలో సివిల్ సర్వెంట్స్‌కు శిక్షణ ఇస్తున్న విషయం తెలిసిందే.
మహారాష్ట్ర అదనపు చీఫ్ సెక్రటరీ నితిన్ గాద్రే జూలై 16వ తేదీన పూజా ఖేద్కర్‌కు లేఖ రాశారు. గవర్నమెంట్ వద్ద ట్రైనింగ్ పీరియడ్‌ను రద్దు చేసినట్లు ఆ లేఖలో తెలిపారు. అయితే ఆ లేఖకు పూజా సమాధానం ఇవ్వలేదని, అలాగే అకాడమీకి కూడా రిపోర్టు చేయలేదని చెప్పారు. ప్రొబెషనరీ ఆఫీసర్ పూజాను రిలీవ్ చేయాలని కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని డీఓపీటీ శాఖ తన లేఖలో కోరింది.
ఓబీసీతో పాటు పీడబ్ల్యూబీడీ కోటాను దుర్వినియోగం చేసినట్లు పూజా ఖేద్కర్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఎక్కువ సార్లు పరీక్ష రాసేందుకు యూపీఎస్సీకి తప్పుడు సమాచారం ఇచ్చిన కేసులో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు బుక్ చేశారు. ఖేద్కర్ కు చెందిన అన్ని డాక్యుమెంట్లను మళ్లీ పరిశీలించేందుకు ఏక సభ్య కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

