Lalu Prasad Yadav | క్షీణించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం.. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స
Lalu Prasad Yadav | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత (RJD Supremo) లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది.
Lalu Prasad Yadav | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత (RJD Supremo) లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. మంగళవారం అనారోగ్యానికి గురికావడంతో ఆయన్ని కుటుంబ సభ్యులు డిల్లీలోని ఎయిమ్స్ (Delhi AIIMS)కు తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో లాలూ చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనారోగ్యం కారణంగా సోమవారం రోజే ఆయన పాట్నా నుంచి ఢిల్లీకి వెళ్లినట్లు తెలిసింది. ల్యాండ్ ఫర్ జాబ్, దాణా కుంభకోణం కేసుల్లో లాలూ ప్రసాద్ సహా ఆయన కుటుంబ సభ్యులు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ రెండు కేసుల్లో బెయిల్‌పై ఉన్నారు.
కాగా, లాలూ ప్రసాద్ యాదవ్ గత కొంత కాలంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. లాలూ కొన్నేళ్లుగా కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలతో సతమతమవుతున్నారు. 2022 నవంబర్‌లో ఆయనకు సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కూడా జరిగింది. ఆయన కుమార్తె రోహిణి.. లాలూకి కిడ్నీ దానం చేశారు. ఆ తర్వాత కొంత కాలానికి తిరిగి భారత్ వచ్చారు. అనారోగ్యం నుంచి కోలుకున్న లాలూ రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఇంతలోనే ఆరోగ్యం తిరగబెట్టినట్లు తెలుస్తోంది.
Also Read..
Plane Crashe | కాఠ్మాండూ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎలా కూలిందో చూడండి.. వైరలవుతున్న వీడియోలు
Kathmandu | టేకాఫ్ అవుతుండగా కుప్పకూలిన విమానం.. 18 మంది మృతి.. ప్రాణాలతో బయటపడ్డ పైలట్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

