Kathmandu | టేకాఫ్ అవుతుండగా కుప్పకూలిన విమానం.. 18 మంది మృతి.. ప్రాణాలతో బయటపడ్డ పైలట్
Kathmandu | పొరుగు దేశం నేపాల్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. టేకాఫ్ అవుతున్న సమయంలో ఓ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది (Plane Crashe).
Kathmandu | పొరుగు దేశం నేపాల్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. టేకాఫ్ అవుతున్న సమయంలో ఓ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది (Plane Crashe). ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోప్పోయారు.
నేపాల్ రాజధాని కాఠ్మాండూ (Kathmandu)లో బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన 9N-AME విమానం కాఠ్మాండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం (Tribhuvan International Airport) నుంచి పోఖార్‌కు బయల్దేరింది. విమానం రన్‌వేపై టేకాఫ్ అవుతున్న (Take Off) సమయంలో స్కిడ్ అయ్యి రన్‌వే అంచున ఉన్న పెన్సింగ్‌ను ఢీ కొట్టి కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో
విమానంలో 19 మంది సాంకేతిక సిబ్బంది ఉన్నట్లు నేషనల్ మీడియా తెలిపింది.
అందులో 18 మంది ప్రాణాలు కోల్పోగా.. పైలట్ 37 ఏళ్ల మనీశ్ షక్య ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పైలట్‌ను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇక ఇప్పటి వరకూ 13 మంది మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదం అనంతరం విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రస్తుతం ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
#WATCH | Plane crashes at the Tribhuvan International Airport in Nepal’s Kathmandu. Details awaited pic.twitter.com/tWwPOFE1qI
— ANI (@ANI) July 24, 2024
Also Read..
NITI Aayog | బడ్జెట్లో అన్యాయం.. నీతి ఆయోగ్ మీటింగ్‌ను బహిష్కరించిన నాలుగు రాష్ట్రాల సీఎంలు
Kamala Harris: తమిళనాడులోని పూర్వీకుల గ్రామంలో కమలా హ్యారిస్ పోస్టర్లు.. వీడియో
Food Science | వెజిటేరియన్లు అయిన పిల్లలకు ప్రొటీన్ ఎలా? ఎలాంటి ఆహారం పెట్టాలి?
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

