Food Science | వెజిటేరియన్లు అయిన పిల్లలకు ప్రొటీన్ ఎలా? ఎలాంటి ఆహారం పెట్టాలి?
పిల్లల ఎదుగుదలకు ప్రొటీన్ చాలా అవసరం. కానీ శాకాహారులకు సాధారణ ఆహారంలో అది సరిపడినంత దొరకడం కష్టం అంటారు కదా! మరి వెజిటేరియన్లు అయిన పిల్లలు చక్కగా ఎదగాలంటే ఎలాంటి ఆహారం పెట్టాలి.
Food Science | పిల్లల ఎదుగుదలకు ప్రొటీన్ చాలా అవసరం. కానీ శాకాహారులకు సాధారణ ఆహారంలో అది సరిపడినంత దొరకడం కష్టం అంటారు కదా! మరి వెజిటేరియన్లు అయిన పిల్లలు చక్కగా ఎదగాలంటే ఎలాంటి ఆహారం పెట్టాలి. జీడిపప్పు, బాదం లాంటి ఖరీదైనవి కాకుండా మామూలు ఆహారం తినేవాళ్లకు కూడా సరిపోయేలా ఏమైనా పదార్థాలు ఉన్నాయా? తెలుపగలరు.
– ఓ పాఠకురాలు
చ నిర్మాణంలోనూ, దాని పనితీరులోనూ ఇది కీలకపాత్ర పోషిస్తుంది. మన శరీరంలోని సగానికిపైగా ప్రొటీన్ కండరం రూపంలో మిగతాది ఎముక, మజ్జ, చర్మాల్లో ఉంటుంది. 20 దాకా అమైనో యాసిడ్ల సమ్మేళనంగా ఇది తయారైక్కని పౌష్టికాహారం పిల్లల ఎదుగుదలకు అత్యావశ్యకం. అందులోనూ శరీర నిర్మాణానికి ప్రొటీన్ చాలా అవసరం. ప్రతి కణంతే, అందులో 9 ముఖ్యమైన వాటిని మనం ఆహారం ద్వారా తీసుకోవలసిందే.
సాధారణంగా మాంసంలో దొరికే ప్రొటీన్‌లో ఇవన్నీ ఉంటాయి. శరీరం దాన్ని బాగా శోషించుకుంటుంది కూడా. కానీ శాకాహారం విషయంలో ఇలా ఉండదు. ఈ పదార్థాల్లో కొన్ని రకాల అమైనో యాసిడ్లు తక్కువగా దొరుకుతాయి. తృణధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పుల సమ్మేళనంగా మన ఆహారాన్ని మలచుకుంటే ఇవన్నీ దొరకడం కష్టమేం కాదు.
ఇందుకోసం, 3:1 నిష్పత్తిలో ధాన్యాలు, పప్పులు కలిపి తీసుకోవాలి. రోజూ పావు లీటరు పాలు దీనికి జోడించాలి. కందులు, పెసలు, ఉలవలు, మినుములు, బఠాణీలు, శనగలు, బొబ్బర్లు, బీన్స్లాంటి చిక్కుడు జాతి గింజల్లో ప్రొటీన్ పుష్కలంగా లభిస్తుంది. అలాగే బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్నట్స్, నువ్వులు, గుమ్మడి, అవిసె గింజల్లో కూడా ఇది అధిక మోతాదులో దొరుకుతుంది.
విభిన్న రకాల రుచికరమైన వంటల రూపంలో వీటిని ఆహారంలో భాగం చేయడం ద్వారా మనం పిల్లలకు కావలసిన ప్రొటీన్‌ని అందించగలుగుతాం.
ఉడికించిన శనగలు, అలసందలు, బొబ్బర్లతో గుగ్గిళ్లు చేసి పెట్టొచ్చు. పెసరట్టు పప్పుల చట్నీ, పెసలు కందులు వేసిన కిచిడీలు, బిసిబేళా బాత్, పచ్చి శనగపప్పు గోధుమపిండితో చేసే పోలెలు కూడా మంచివే.
పనీర్ పులావ్, సోయా పులావ్ లాంటివీ బాగుంటాయి. మొలకెత్తిన గింజలతో చేసే స్టీమ్డ్ టిక్కా, సున్నుండల్లాంటివి బలాన్నిస్తాయి. ఇడ్లీ, దోశల్లోనూ ప్రొటీన్ దొరుకుతుంది.
బతుకమ్మ పండుగకు చేసే రకరకాల సత్తుపొడులు,శనగపప్పు కలిపి చేసే సర్వపిండి కూడా ఈ కోవలోవే.
పండ్లలో గింజల్ని కలిపి ఇవ్వచ్చు. దానిమ్మ గింజల్లో గుమ్మడి, పుచ్చ లేదా సన్‌ఫ్లవర్ గింజల్లాంటివి కలిపి పెట్టొచ్చు.
గ్లాసెడు పాలల్లో డ్రైఫ్రూట్ పొడి కలిపి, లేదా చిరుధాన్యాలను మొలకెత్తించి బెల్లంతో కలిపిన పొడి కలిపి ఇవ్వచ్చు.
మజ్జిగ, పెరుగు, చల్లచారు కూడా ప్రొటీన్ అందించేవే.
మయూరి ఆవుల
న్యూట్రిషనిస్ట్ , Mayuri.trudiet@ gmail.com
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

