బిజీ అయితే.. టైమ్ దొరకదు. టైమ్ దొరుకుతుందంటే బిజీ కాదని అర్థం. బిజీ కాకపోతే ఓ బాధ. బిజీ అయి టైమ్ దొరక్కపోతే ఓ బాధ. అదే డెస్టినీ. భగవంతుడు ఏదీ పూర్తిగా ఇవ్వడు. రష్మిక మందన్నా ఇటీవల పెట్టిన పోస్ట్ ఈ వేదాంతాన్ని గుర్తుచేసేలా ఉంది. ‘తెల్లవారు జామున 3గంటల 50 నిమిషాలకు ఫ్లైట్. అంటే.. రెండు గంటల ముందే ఎయిర్పోర్ట్లో ఉండాలి.
ఈ జర్నీ ఎంతో దారుణం.. అసలు ఇది పగలో రాత్రో అర్థం కావడంలేదు.’ అంటూ ఫ్లైట్ విండో లోంచి తీసిన ఓ ఫొటోను షేర్ చేశారు రష్మిక. అయితే.. ఈ ప్రయాణం ఎక్కడికి? ఎన్ని గంటలు? అనే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. ఈ పోస్ట్ చూసినవారంతా.. ‘లైమ్లైట్లో ఉన్నంతవరకే ఈ అదృష్టం.. ఆ తర్వాత కోరుకున్నారాదు..’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.