ముందు ఒప్పుకున్న కమిట్మెంట్స్ని చకచకా పూర్తి చేసేస్తున్నారు పవన్‌కల్యాణ్. రీసెంట్గా ‘హరిహర వీరమల్లు’గా సందడి చేసిన ఆయన.. ఈ నెల 27న ‘ఓజీ’గా రాబోతున్నారు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న సినిమా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశిఖన్నా కథానాయికలు. పవన్‌కల్యాణ్, హరీశ్‌శంకర్ కలయికతో వచ్చిన ‘గబ్బర్‌సింగ్’ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో తెలిసిందే.
ఈ కాంబినేషన్ రిపీట్ కావడంతో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఒక పాటతో పాటు ైక్లెమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌ని కూడా హరీశ్‌శంకర్ పూర్తి చేశారు. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు నవీన్ యర్నేనీ, వై రవిశంకర్ సన్నాహలు చేస్తున్నారు.
ఇదిలావుంటే.. రీసెంట్గా షూట్ చేసిన ఈ సినిమా పాటపై సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. పవన్‌సార్ ఈ పాట విన్న వెంటనే.. కరచాలనం చేసి, పాట వింటేనే డ్యాన్స్ చేయాలనిపిస్తుందంటూ అభినందించారని, అన్నట్టే ఆయన ఆ పాటలో డ్యాన్స్ అదరగొట్టేశారని తెలిపారు. దీంతో ఈ పాటపై అభిమానుల్లో ఆసక్తి రెట్టింపయ్యింది. మైత్రీ మూవీమేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.