‘ఆసక్తికరమైన హారర్ నేపథ్యం ఉన్న సినిమా ‘కిష్కింధపురి’. గత ఏడాది ఫిబ్రవరిలో దర్శకుడు కౌశిక్ ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. ఇప్పటివరకూ చాలా హారర్ సినిమాలొచ్చాయి. అయితే ఈ కథ మాత్రం చాలా యూనిక్. హారర్ థ్రిల్లర్, హారర్ మిస్టరీ ఈ రెండినీ మిళితం చేసి ఓ కొత్త కథ చెప్పాడు దర్శకుడు.’ అని నిర్మాత సాహు గారపాటి అన్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటించిన మిస్టీరియస్ హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’.
అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. కౌశిక్ పెగల్లపాటి దర్శకుడు. షైన్ స్క్రిన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో సాహు గారపాటి విలేకరులతో మాట్లాడారు. ‘ఇప్పటివరకూ ఇలాంటి హారర్ థ్రిల్లర్ రాలేదు. రేడియో నుంచి వచ్చే ఓ వాయిస్ చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే హారర్ అంశాలను అద్భుతంగా ప్రజెంట్ చేశాడు దర్శకుడు. కథను ఎంత గొప్పగా చెప్పాడో, అంతకంటే గొప్పగా తీశాడు.
యానిమల్, పుష్ప చిత్రాలకు పనిచేసిన టెక్నీషియన్స్ ఈ సినిమాకు పనిచేశారు. రన్ టైమ్ కూడా చాలా క్రిస్ప్‌గా ఉంటుంది. ఆడియన్స్‌కి తప్పకుండా ఈ సినిమా నచ్చుతుంది.’ అని సాహు గారపాటి నమ్మకం వెలిబుచ్చారు. బెల్లంకొండ సాయి స్క్రీన్ ప్రజెన్స్ కొత్తగా ఉంటుందని, ఇప్పటివరకూ ఆయన కెరీర్లో ఇలాంటి సినిమా చేయలేదని, ఫస్టాఫ్ కామెడీగా సాగే ఈ సినిమా.. సెకండాఫ్ యాక్షన్ మోడ్‌లో హారర్ ఫిల్మ్‌గా టర్న్ అవుతుందని, కంటెంట్ డిమాండ్ మేరకు ఖర్చు పెట్టామని, నెలరోజులు కష్టపడి రెండు కోట్లతో సెట్ వేశామని సాహు గారపాటి చెప్పారు. సాంకేతికంగా అన్ని విధాలా సినిమా ఆకట్టుకుంటుందని, బిజినెస్ విషయంలోనూ కంఫర్టబుల్‌గా ఉన్నామని సాహు తెలిపారు. ‘మా ‘భగవంత్ కేసరి’కి నేషనల్ అవార్డు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే బాలయ్యబాబుతో మరో సినిమా చేస్తాం. ఆ సినిమా కూడా అనిల్ రావిపూడి దర్శకత్వంలోనే ఉంటుంది.’ అని తెలిపారు సాహు గారపాటి.