Rahul Dravid : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో(WTC Final 2023) భారత జట్టు ఓటమిపై హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) స్పందించాడు. టీమ్‌లోని టాప్ – 6 ఆటగాళ్లు తమ సామర్థ్యం మేరకు ఆడకపోవడం వల్లే ఓడిపోయామని అన్నాడు. అంతేకాదు ఫైనల్‌కు ముందు ఆటగాళ్లతో ఏమేం చర్చించారు? అనేది కూడా చెప్పుకొచ్చాడు. ‘జట్టులో అనుభవజ్ఞులైన ఆరుగురు ఆటగాళ్లు ఉన్నారు. వీళ్లు ఆస్ట్రేలియా గడ్డపై రెండు సార్లు జట్టను గెలిపించారు. అంతేకాదు ఇంగ్లండ్ పర్యటనలోనూ సత్తా చాటారు.
కానీ, డబ్ల్యూటీసీ ఫైనల్ ఫైట్‌లో మాత్రం నిరాశపరిచారు. ఓవల్(Oval) వికెట్ బ్యాటర్లకు సవాల్ విసిరింది. దాంతో, మా టాప్ 6 ఆటగాళ్లు వాళ్ల సామర్థ్యం మేరకు ఆడడంలో విఫలమయ్యారు. అందుకనే ఫైనల్లో ఓడిపోయాం అని ద్రవిడ్ తెలిపాడు. కోచ్‌గా రవిశాస్త్రి(Ravi Shastri) కాలపరిమితి ముగిడంతో అనుభవజ్ఞుడైన ద్రవిడ్‌ను బీసీసీఐ(BCCI) కోచ్‌గా నియమించింది. అతడి ఆధ్వర్యంలో భారత జట్టు న్యూజిలాండ్ సిరీస్, స్వదేశంలో బోర్డర్ గావస్కర్(Border – Gavaskar Trophy) ట్రోఫీ నెగ్గింది.
కోహ్లీ(14, 46), రహానే(89, 46)
ఓపెనర్లు రోహిత్ శర్మ(15, 43), శుభ్‌మన్ గిల్ (13, 18).. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ భారీ స్కోర్లు చేయడంలో విఫలమయ్యారు. ఫైనల్ వరకు ఇంగ్లండ్ గడ్డ మీదే కౌంటీ మ్యాచ్‌లు ఆడిన పుజారా(14, 27) కూడా తేలిపోయడు. ఈ నయా వాల్ అనవసర షాట్లు ఆడి ఔటయ్యాడు. ఇక ఎన్నో అంచనాలు ఉన్న కోహ్లీ(14, 46) క్రీజులో కుదురుకున్నాక వికెట్ ఇచ్చేశాడు. రెండుసార్లు స్మిత్ అద్భుతంగా క్యాచ్ పట్టడంతో అతను వెనుదిరిగాడు. ఇక ఐపీఎల్ 16వ సీజన్ ఫామ్‌తో రీ ఎంట్రీ ఇచ్చిన రహానే(89, 46) ఒక్కడే రాణించాడు. 89, 46 పరుగులతో జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. పంత్ ప్లేస్‌లో వచ్చిన భరత్(5, 23) బ్యాటింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.
స్టీవ్ స్మిత్(121)
ఓవల్ స్టేడియం వేదికగా టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా తలపడ్డాయి. మొదటి ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్(163), స్టీవ్ స్మిత్(121) సెంచరీలతో చెలరేగారు. దాంతో, ఆస్ట్రేలియా 469 రన్స్ కొట్టింది. ఆ తర్వాత టాపార్డర్ విఫలం కావడంతో భారత్ 269కే ఆలౌటయ్యింది. రెండో ఇన్నింగ్స్‌ను ఆసీస్ 270 వద్ద డిక్లేర్ చేసింది. 444 పరుగుల ఛేదనలో టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ(43), శుభ్‌మన్ గిల్(18) శుభారంభం ఇచ్చారు. అయితే.. గ్రీన్ వివాదాస్పద క్యాచ్‌తో గిల్ వెనుదిరిగాడు. ఆ తర్వాత వరుస ఓవర్లలో రోహిత్, పుజారా(27) పెవిలియన్ చేరారు. విరాట్ కోహ్లీ(49), అజింక్యా రహానే(46), శ్రీకర్ భరత్(23) పోరాడినా 234 వద్ద ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది. దాంతో 209 పరుగుల తేడాతో ఆసీస్ అద్భుత విజయం సాధించింది. టెస్టు గదతో పాటు రూ. 13 కోట్లు(1.6 మిలియన్ డాలర్లు) ఆ జట్టుకు ముట్టాయి. రన్నరప్‌గా నిలిచిన భారత జట్టుకు రూ. 6.5 కోట్లు(8 లక్షల డాలర్లు) బహుమతిగా లభించాయి.
Champion bowlers 💪#WTC23 pic.twitter.com/GU8eciglry
— ICC (@ICC) June 11, 2023