కవాడిగూడ, నవంబర్ 27 : కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు క ల్పిస్తామని అసెంబ్లీ, క్యాబినెట్లో నమ్మిం చి ధోకా చేసిందని బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయకపోతే కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలని హెచ్చరించారు. జీవో నంబర్ 46 రద్దు చేసి, పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.
గురువారం తెలంగాణ బీసీ జేఏసీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకుడు నీల వెంకటేశ్, బీసీ వి ద్యార్థి సంఘం నాయకుడు మోదీ రాందేవ్, రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షుడు జిల్లపల్లి అంజి నాయకత్వంలో నిజాం కళాశాల నుంచి ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. జా తీయ బీసీ సంక్షేమ సంఘం కోఆర్డినేటర్ డా క్టర్ అరుణ్‌కుమార్, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు భూమన్న యాదవ్ పాల్గొన్నారు.