హైదరాబాద్, నవంబర్ 27(నమస్తే తెలంగాణ) : గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండు కమ్యూనిస్టు పార్టీలు కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. సీపీఐ, సీపీఎం పరస్పర అవగాహనతో ఒకరిపై ఒకరు పోటీ చేసుకోవద్దని గురువారం హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఇరు పార్టీల రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుల సంయుక్త సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. రెండు పార్టీలు కలిసి పనిచేయాలని, పరస్పర పోటీని నివారించాలని నేతలు నిర్ణయించారు. ఖమ్మంలో డిసెంబర్ 26న నిర్వహించాల్సిన సీపీఐ శత వార్షికోత్సవ సభను గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జనవరి 18కి వాయిదా వేసినట్టు కూనంనేని ప్రకటించారు. సీపీఐ రాష్ట్ర కా ర్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి, సీపీఎం రాష్ట్ర కా ర్యదర్శి జాన్వెస్లీ, సీపీఐ సీనియర్ నేతలు చా డ వెంకట్రెడ్డి, సయ్యద్ అజిత్పాషా, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు శ్రీనివాసరావు, నరసింహ, బీఎస్ బోస్, సీపీఎం నాయకులు వీరయ్య, రంగారెడ్డి, నాగయ్య పాల్గొన్నారు.
హైదరాబాద్, నవంబర్ 27(నమస్తే తెలం గాణ) : రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు శుక్రవారం విచారణ చేయనున్నది. బీసీ రిజర్వేషన్ల వివాదం ప్రధాన న్యాయమూర్తి బెంచ్ వద్ద పెండింగ్లో ఉన్నందున ఎలాంటి ఉత్తర్వులు జారీ చే యబోమని గురువారం ఈమేరకు జస్టిస్ మా ధవీదేవి ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయకపోగా బీసీలకు 23శాతం రిజర్వేషన్లు కల్పించకపోవడం అ న్యాయమని పిటిషనర్ల తరఫు న్యాయవా దులు వాదించారు. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించిన తర్వా త బీసీ రిజర్వేషన్లు ఉంటాయని ఎన్నికల సంఘం తరఫు సీనియర్ న్యాయవాది జీ వి ద్యాసాగర్ బదులిచ్చారు. వీటిపై శుక్రవారం తేల్చుతామని హైకోర్టు ప్రకటించింది.