హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): ఆగ్నేయ బంగాళాఖాతం లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని, దక్షిణ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రభావంతో తమిళనాడు, శ్రీలంకలో వర్షా లు కురుస్తాయని పేర్కొన్నది. తెలంగాణ, ఏపీపై ప్రభావం అంతగా ఉండకపోవచ్చని వెల్లడించింది. ఈ నెల19 నుంచి బంగాళాఖాతంలో వాతావరణ మార్పులు ఉంటాయని తెలిపింది. మొ దట ఉపరితల ఆవర్తనం ఏర్పడి, ఆ తర్వాత అల్పపీడనంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయని వివరించింది.
దీంతో తెలుగు రాష్ర్టాల్లోని కొన్ని ప్రాం తాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకా శం ఉన్నదని పేర్కొన్నది. ముఖ్యంగా 25 నుంచి 28 వరకు తెలంగాణలో వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది. మరోవైపు చలి తీవ్రత తగ్గడంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని, దాదాపు అన్ని జిల్లాల్లో 30 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదైయ్యాయని వెల్లడించింది. నెలా ఖరుకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరే అవకాశాలుంటాయని పేర్కొన్నది.