Pratika Rawal : ప్రపంచ కప్‌లో చెలరేగిపోతున్న భారత ఓపెనర్ ప్రతీకా రావల్ (Pratika Rawal) శతకంతో మెరిసింది. న్యూజిలాండ్ బౌలర్లను ఉతికేస్తూ.. సాధికారిక ఇన్నింగ్స్ ఆడిన ప్రతీక సెంచరీతో తన జోరు చూపించింది. తద్వారా ప్రపంచ కప్‌లో మొదటి సెంచరీ సాధించిందీ చిచ్చరపిడుగు. అంతకంటే ముందు స్మృతి మంధాన (Smriti Mandhana) సైతం సెంచరీ బాదేయడంతో.. అరుదైన రికార్డు ఈ జంట సొంతమైంది.
మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో శతకాలు కొట్టిన మూడో ఓపెనింగ్ జోడీగా చరిత్రకెక్కారు మంధాన, ప్రతీక. ఇంగ్లండ్ ఓపెనర్లు లిన్నే థామస్, ఎనిడ్ బేక్వెల్ 1973లో సెంచరీ సాధించారు. అనంతరం.. ఆస్ట్రేలియా ద్వయం లిండ్సే రీలర్, రుత్ బక్స్టెన్లు.. 1988లో నెదర్లాండ్స్‌పై శతకాలతో కదం తొక్కారు.
Pratika Rawal’s second ODI century is a memorable one, truly a moment to cherish forever! ✨💯#INDvNZ #PratikaRawal #CWC25 #Sportskeeda pic.twitter.com/pHUxxL12g2
— Sportskeeda (@Sportskeeda) October 23, 2025