Crime news : ఏడేళ్ల బాలుడు (Seven years boy) తన స్నేహితులతో కలిసి ఇంటిముందు ఆడుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆ బాలుడు జామకాయ (Guava) ను పైకి విసిరగా అది పక్కింట్లో పడింది. దాంతో పక్కింటి వ్యక్తి ఆగ్రహించాడు. బాలుడిని ఇంట్లోకి లాక్కెళ్లి తీవ్రంగా కొట్టాడు. కుక్కతో కరిపించాడు. ఇంతలో ఏడుపు విన్న బాలుడి కుటుంబసభ్యులు అతడిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ జిల్లాలో అమన్ కుశ్వాహ ఇంటి పక్కన ఏడేళ్ల బాలుడు యశ్ శుక్లా కుటుంబం నివాసం ఉంటోంది. ఈ క్రమంలో యశ్ శక్లా సోమవారం తన మిత్రులతో కలిసి ఇంటిముందు ఆడుతూ ఓ జామకాయను పైకి విసిరాడు. అది పొరపాటున అమన్ కుశ్వాహ ఇంట్లో పడింది. దాంతో అతడు ఆగ్రహించాడు.
యశ్ శుక్లాను ఇంట్లోకి లాక్కెళ్లి తీవ్రంగా కొట్టాడు. అంతటిక ఆగకుండా తన పెంపుడు కుక్కను అతడిపైకి వదిలి కరిపించాడు. బాలుడి అరుపులు విన్న అతడి కుటుంబసభ్యులు అమన్ కుశ్వాహ ఇంట్లోకి వెళ్లి నిలదీశారు. దాంతో అమన్ వారిని దుర్భాషలాడాడు. అనంతరం యశ్ శుక్లాను అతడి పేరెంట్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఆ తర్వాత యశ్ తల్లి స్వాతి శుక్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుసుకున్న అమన్ కుశ్వాహ పారిపోయాడు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.