Leopard | అడవుల్లో ఉండాల్సిన క్రూర మృగాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. అటవీ సమీప గ్రామాల్లోకి ప్రవేశించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లోని ఉనా జిల్లాలో ఓ చిరుతపులి (Leopard) ఠారెత్తించింది. పొలాల్లోకి ప్రవేశించి అక్కడ పనిచేస్తున్నవారిపై దాడి చేసింది.
ఈనెల 20న చిరుత పొలాల్లో దాక్కుని ఉంది. దాని కేకలు విన్న సమీప ప్రజలు గ్రామంవైపు పరుగులుతీశారు. ఆ సమయంలో చిరుత వారిపై దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు గాయపడ్డారు. అప్రమత్తమైన గ్రామస్థులు కర్రలు, రాళ్లతో చిరుతపై ఎదురుదాడికి దిగారు. గ్రామస్థులు దాడి చేయడంతో చిరుత పొలాల్లో నుంచి తప్పించుకుని ఓ ఇంట్లోకి ప్రవేశించింది.
గ్రామస్థులు (Villagers) వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అటవీ సిబ్బంది ట్రాంక్విలైజర్ డార్ట్ను ఉపయోగించారు. చిరుత స్పృహ కోల్పోయిన తర్వాత దాన్ని బోనులో ఉంచి వన్యప్రాణుల చికిత్స కేంద్రానికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళన వాతావరణం నెలకొంది. చిరుత దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
हिमाचल प्रदेश के ऊना जिले के हरोली क्षेत्र के करमपुर गाँव में तेंदुआ घुस आया। लोगों ने उसे भगाने की कोशिश की तो उसने हमला कर दिया। घटना में छह लोग घायल हुए। वन विभाग की टीम ने तेंदुए को ट्रैंक्विलाइज़र गन से बेहोश कर पकड़ा।#HimachalPradesh #Una #Haroli #LeopardAttack #Wildlife pic.twitter.com/VZrLxYsrjd
— @iamvikasbaliyan -Vikas Chaudhary |🇮🇳 (@10iamvikas) October 22, 2025
Also Read..
Belgium | త్వరలో భారత్కు మెహుల్ చోక్సీ.. అప్పగింత విషయంలో కీలక వ్యాఖ్యలు చేసిన బెల్జియం కోర్టు..!
Walmart | టీసీఎస్ బాటలోనే వాల్మార్ట్.. హెచ్-1బీ వీసా అభ్యర్థుల నియామకాలు నిలిపివేత..!
Technical Snag | మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య