Walmart | అమెరికా (America)లో ఉద్యోగం చేయాలనుకునే వారికి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. విదేశీ నిపుణుల నియామకానికి జారీ చేసే హెచ్-1బీ వీసా (H1B Visa Fee) దరఖాస్తులపై వార్షిక రుసుంను లక్ష డాలర్లకు పెంచారు. ట్రంప్ నిర్ణయంతో అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న టెక్ సంస్థల్లో గందరగోళం నెలకొంది. ఈ ఫీజు పెంపు కారణంగా, వీసా అభ్యర్థులను నియమించుకోవడంలో పలు టెక్ సంస్థలు వెనకడుగు వేస్తున్నాయి. ట్రంప్ నిర్ణయంతో ఈ ఆర్థిక సంవత్సరంలో హెచ్-1బీ వీసాదారులను అమెరికాలో ఉద్యోగులుగా నియమించుకోమని దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికాకు చెందిన రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ (Walmart) కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నట్లు తెలుస్తోంది.
వాల్‌మార్ట్ హెచ్-1బీ వీసా అభ్యర్థుల నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. హెచ్-1బీ వీసా నియామక విధానాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపినట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. అయితే, కస్టమర్లకు ఉత్తమ సేవ అందించేందుకు, ప్రతిభావంతులను నియమించడంలో కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. కాగా, ప్రస్తుతం వాల్‌మార్ట్‌లో 2,390 హెచ్-1బీ వీసా హోల్డర్లు పని చేస్తున్నారు.
హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్లకు(దాదాపు రూ. 88 లక్షలు) పెంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నెలరోజుల తర్వాత ఫీజును ఎలా చెల్లించాలో, ఈ ఫీజు నుంచి ఎవరికి మినహాయింపు లభిస్తుందో వివరాలు వెల్లడించింది. అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) సోమవారం ఫీజు పేమెంట్ పోర్టల్‌ను ప్రవేశపెడుతూ ఫీజు చెల్లించినట్లు రసీదు సమర్పించిన దరఖాస్తుదారులు మాత్రమే తదుపరి అడుగులు వేయాలని, అయితే కొందరు స్టూడెంట్ వీసాదారులకు మాత్రం ఫీజు రాయితీ ఉంటుందని తెలిపింది.
ఎఫ్-1 వీసాలపై ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు, ఎల్-1 వీసాలపై ఉన్న ప్రొఫెషనల్స్‌తోసహా ప్రస్తుత వీసాదారులు హెచ్-1బీ హోదా కోసం దరఖాస్తు చేసినపుడు లక్ష డాలర్లను చెల్లించవలసిన అవసరం లేదని యూఎస్సీఐఎస్ వెల్లడించింది. అమెరికా వెలుపల ఉన్న వ్యక్తులు దాఖలు చేసే దరఖాస్తులకు మాత్రం కొత్త ఫీజు వర్తిస్తుందనిగ్రీన్ అండ్ స్పీగెల్‌కు చెందిన డాన్ బెర్గెర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు ఫోర్బ్స్ తెలిపింది. అమెరికాను వీడి ఉండి ప్రస్తుత హెచ్-1బీ వీసాపై దేశంలోకి తిరిగి ప్రవేశించడం కోసం మళ్లీ దరఖాస్తు చేసుకునే వారికి కొత్త ఫీజు వర్తిస్తుందని యూఎస్సీఐఎస్ తెలిపింది. హోదా మార్పు లేదా స్టే పొడిగింపునకు దరఖాస్తుదారు అర్హుడు కాదని తాము నిర్ధారిస్తే కంపెనీ యజమాని ఫీజును చెల్లించాల్సిన అవసరం ఉంటుందని యూఎస్సీఐఎస్ పేర్కొంది.
అమెరికా (America)లో ఉద్యోగం చేయాలనుకునే వారికి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. విదేశీ నిపుణుల నియామకానికి జారీ చేసే హెచ్-1బీ వీసా (H1B Visa Fee) దరఖాస్తులపై వార్షిక రుసుంను లక్ష డాలర్లకు పెంచారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ట్రంప్ చర్య భారతీయులపై తీవ్ర ప్రభావం పడనుంది.భారత్‌కు చెందిన పలు దిగ్గజ సంస్థలు ఎక్కువగా హెచ్-1బీ వీసాలతోనే అమెరికాలో తమ వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ వీసాలతోనే భారతీయుల్ని నియమించుకుంటున్నాయి. ఇందులో అమెజాన్ (Amazon) సంస్థ టాప్‌లో ఉంది. ఆ తర్వాత టాటా కన్సల్టెన్సీ (TCS) రెండోస్థానంలో నిలిచింది.
యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డేటా ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరం జూన్ నాటికి అమెజాన్ దాదాపు 10,044 హెచ్-1బీ వీసాలను ఉపయోగించింది. ఆ తర్వాత టీసీఎస్ 5,505, మైక్రోసాఫ్ట్ (5,189), మెటా (5,123), యాపిల్ (4,202), గూగుల్ (4,181), డెలాయిట్ (2,353), ఇన్ఫోసిస్ (2,004), విప్రో (1,523), టెక్ మహీంద్రా అమెరికాస్ (951), ఒరాకిల్ (2,092), అమెజాన్ వెబ్ సర్వీసెస్ (2,347), కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ (2,493), వాల్‌మార్ట్ అసోసియేట్స్ (2,390) హెచ్-1బీ వీసాలను దక్కించుకున్నాయి. ఇవే కాకుండా అమెరికాకు చెందిన పలు కంపెనీలు కూడా హెచ్-1బీ వీసాలతో ఎక్కువమంది భారతీయులను నియమించుకుంటున్నాయి. వాటిపై కూడా తీవ్ర ప్రభావం పడనుంది.
టీసీఎస్ అమెరికాలో తమ ఉద్యోగుల నియామక వ్యూహంపై ఇటీవలే స్పష్టతను ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో హెచ్-1బీ వీసాదారులను అక్కడ ఉద్యోగులుగా నియమించుకోమని ఆ కంపెనీ సీఈవో కృతివాసన్ తెలిపారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం స్థానిక ప్రతిభావంతుల నియామకంపై టీసీఎస్ దృష్టి పెడుతుంది. ప్రస్తుతం అమెరికాలోని సుమారు 33 వేల టీసీఎస్ ఉద్యోగుల్లో సుమారు 11 వేల మంది హెచ్-1బీ వీసాదారులు ఉన్నారు. హెచ్-1బీ వీసా కలిగిన ఉద్యోగులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనుకుంటున్నట్టు కృతివాసన్ తెలిపారు. ఉద్యోగుల కోసం ఎల్-1వీసాల సదుపాయం ఉన్నప్పటికీ అవి హెచ్-1బీని పూర్తిగా భర్తీ చేయలేవని ఆయన చెప్పారు.
Also Read..
Road Accident: ఢీకొన్న రెండు బస్సులు.. 63 మంది మృతి
online jihadi course | జైషేలో మహిళా ఉగ్రవాద దళం.. ఆన్లైన్లో జిహాదీ కోర్సులు
White House: వైట్‌హౌజ్ వద్ద భద్రతా లోపం.. బ్యారికేడ్లను ఢీకొట్టిన కారు