online jihadi course | పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్ (Jaish-e-Mohammed) ఉగ్రవాద సంస్థ తన కార్యకలాపాలను విస్తరించేందుకు మరో కొత్త కుట్రకు తెరలేపిన విషయం తెలిసిందే. కేవలం మహిళలతో ఓ ఉగ్రవాద గ్రూప్‌ను తయారుచేస్తున్నది. మసూద్ అజార్ (Masood Azhar) సోదరి సాదియా అజార్ (Sadiya Azhar) నేతృత్వంలో ‘జమాతుల్-ముమినాత్’ పేరుతో ఓ ప్రత్యేక యూనిట్‌ను తయారుచేస్తున్నది. ఇందులో భాగంగానే మహిళలకు తాజాగా ఆన్లైన్ జిహాదీ కోర్సులను (online jihadi course) ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఈ కోర్సుకు ‘తౌఫల్ అల్ ముమినత్’గా పేరు పెట్టినట్లు సమాచారం. మహిళలకు మతపరమైన, జిహాద్ ఆధారిత పాఠాలను బోధిస్తున్నట్లు తెలిసింది. నవంబర్ 8 నుంచి ఈ ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభం కానున్నాయి. రోజుకు 40 నిమిషాల పాటూ రోజువారీ సెషన్ ఉంటుందని.. మసూద్ అజార్ సోదరీమణులు సాదియా అజార్, సమైరా అజార్ (Samaira Azhar).. ఆన్లైన్ ద్వారా మహిళలకు పాఠాలు బోధించనున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఈ క్లాసెస్‌కు జాయిన్ అయ్యే ప్రతి మహిళా రూ.500 (పాకిస్థానీ రూపాయలు) విరాళంగా అందించాల్సిందిగా.. మసూద్ సోదరీమణులు కోరినట్లు సమాచారం. కాగా, తీవ్రవాదుల భార్యలు, పేద మహిళలను రిక్రూట్ చేసుకోవడానికి జైషే మహమ్మద్ తొలుత ప్రాధాన్యం ఇస్తున్నది. బహావల్పూర్, కరాచీ, ముజఫరాబాద్, కోటిలీ, హరిపూర్ మదర్సాల్లోని మహిళలను ఉగ్రవాదం వైపు తీసుకొస్తున్నట్టు తెలిసింది.
Also Read..
IMD | కుండపోత వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Air Pollution | ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగ.. క్షీణించిన గాలి నాణ్యత
PM Modi | ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలి.. ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ