వాషింగ్టన్: అమెరికా శ్వేత సౌధం(White House) వద్ద భద్రతా లోపం ఘటన జరిగింది. వైట్‌హౌజ్ సెక్యూర్టీ చెకింగ్ పాయింట్ బ్యారికేడ్లను ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లోపలే ఉన్నట్లు తెలిసింది. మంగళవారం రాత్రి 10.30 నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగింది. 17వ, ఈ స్ట్రీట్ మధ్య ఉన్న బారికేడ్లను కారు ఢీకొట్టింది. 2010 అకురా టీఎస్ఎక్స్ మేరీల్యాండ్ లైసెన్స్ ప్లేట్‌తో ఆ కారు ఉన్నట్లు గుర్తించారు.
భద్రతా అధికారులు తక్షణమే ఆ ప్రదేశానికి చేరుకుని కారును సీజ్ చేశారు. సీక్రెట్ సర్వీస్ ఆఫీసర్లు డ్రైవర్‌ను తక్షణమే అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ ఎవరన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. కావాలని శ్వేత సౌధాన్ని ఢీకొన్నాడా లేక అనుకోకుండా ప్రమాదం జరిగిందో లేదో తెలియదు. వైట్‌హౌజ్ రోడ్డు మార్గాన్ని మూసివేశారు. వైట్‌హౌజ్‌లోని ఈస్ట్ వింగ్‌లో ప్రస్తుతం మరమ్మత్తులు జరుగుతున్నాయి.
ఇటీవల వైట్‌హౌజ్ గేట్లను వాహనాలు ఢీకొన్న ఘటనలు జరిగాయి. గత ఏడాది జనవరి, మే నెలల్లో వైట్‌హౌజ్‌ను ఢీకొన్న ఘటనలు జరిగాయి. ఇక మే 2023లో కూడా ఓ డ్రైవర్ తన ట్రక్కుతో వైట్‌హౌజ్‌పై దూసుకెళ్లాడు.
BREAKING NEWS: car at White House appears to have either stopped at or struck the barricades and several blocks around the complex now shut down as Secret Service investigates. pic.twitter.com/unJ14nj4G5
— Scott Thuman (@ScottThuman) October 22, 2025