INDW vs NZW : సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్న భారత ఓపెనర్ స్మృతి మంధాన(109) శతకంతో కదం తొక్కింది. గత మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై అర్ధ శతకంతో మెరిసిన తను.. ఈసారి న్యూజిలాండ్ బౌలర్లకు దడపుట్టిస్తూ సెంచరీతో జట్టుకు శుభారంభమిచ్చింది. హాఫ్ సెంచరీ తర్వాత జోరు పెంచిన మంధాన.. జెస్ కేర్ ఓవర్లో సింగిల్ తీసి వరల్డ్ కప్ చరిత్రలో మూడో సెంచరీ నమోదు చేసింది. ఈ సీజన్లో ఆమెకిది ఐదో శతకం కావడం విశేషం.
ముంబైలోని డీవై పాటిల్ స్టడేఇయంలో ఆరంభం నుంచి దంచేసిన మంధాన.. మరో ఓపెనర్ ప్రతీకా రావల్(97 నాటౌట్)తో కలిసి రెండొదల భాగస్వా్మ్యం నెలకొల్పింది. సెంచరీ తర్వాత సుజీ బేట్స్ ఓవర్లో సిక్సర్‌కు యత్నించిన మంధాన బౌండరీ వద్ద దొరికిపోయింది. దాంతో.. 212 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం.. బ్యాటింగ్ ఆర్డర్లో ముందొచ్చిన జెమీమా రోడ్రిగ్స్ (13 నాటౌట్)సైతం దూకుడుగా ఆడుతోంది. 37 ఓవర్లకు వికెట్ నష్టానికి 235 పరుగులు చేసింది భారత్.
◾ 2017 vs WI
◾ 2022 vs WI
◾ 2025 vs NZSmriti Mandhana now has the joint-most hundreds for India in the women’s World Cup 👑 pic.twitter.com/jYE4zsUyCE
— ESPNcricinfo (@ESPNcricinfo) October 23, 2025